పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 28( కలం శ్రీ న్యూస్ ):ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మాజీ ప్రధాని,మాజీ ఏఐసీసీ అధ్యక్షులు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమం బుధవారం మంథనిలో ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంథని నియోజకవర్గానికి నాలుగు సార్లు శాసనసభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ,కేంద్ర మంత్రిగా,ప్రధానమంత్రిగా పదవులు పొంది ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించడం జరిగిందని దేశ ప్రధానిగా వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాయన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక మాధ్యంలో కొట్టుమిట్టాడుతుంటే భారతదేశం బలంగా నిలబడడానికి కారణం వారు తీసుకున్నటువంటి సంస్కరణలని కొనియాడారు. 13 భాషలు మాట్లాడగల బహుభాషా కోవిదులని అన్నారు. శ్రీధర్ బాబు నాయకత్వంలో వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పెండ్రు రమ,చొప్పగట్ల హనుమంతు, కాంగ్రెస్ నాయకులు ఎరుకల ప్రవీణ్,జంజర్ల శేఖర్,మంథిని సత్యం,అజీమ్ ఖాన్,రావికంటి సతీష్,జనగామ నర్సింగరావు, ఎండి అలీం ఖాన్ ,ఆర్ల నాగరాజు, పెంటరి రాజు,దొరగొర్ల శ్రీనివాస్, రామ్ రాజశేఖర్, తమ్మిశెట్టి రమేష్, బూడిద శంకర్,మంథని శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్,ఎరుకల శేఖర్, పులి కృష్ణ ,జనగామ సడవలి, సత్యనారాయణ గౌడ్, రంజిత్, గుండేటి రాజశేఖర్,ఊరకొండ గణేష్,ఎహసాన్ ,రాజయ్య ,రాజేశ్వర్ ,ఆరెల్లి కిరణ్ గౌడ్,అట్టెం వినయ్ తదితరులు పాల్గొన్నారు.