బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 28( కలం శ్రీ న్యూస్ ):మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్ పల్లికి చెందిన దాసరి సంతోష్ ఇటీవల మరణించగా బుధవారం వారి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి,తమ ప్రగాఢ సానుభూతి తెలిపి,ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి.ఆయన వెంట రామగిరి మండల ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్,కుమార్ యాదవ్, కిరణ్ గౌడ్, ఓదెలు,కుమార్,శ్రావణ్,దేవ్ యాదవ్,రిషి,రజినీకాంత్, సమ్మయ్య,రాజేష్ మరియు యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.