విద్యా మహాసభలను విజయవంతం చేసుకుందాం
కొండేల మారుతి
మంథని జూన్ 27(కలం శ్రీ న్యూస్):మంథని హైస్కూల్ 121 వసంతాల నేపథ్యంలో విద్యా మహాసభలను విజయవంతం చేయాలని విన్నపం చేసిన కొండేల మారుతి. ఆహ్వాన ప్రక్రియలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తహర్ హుషెన్ ప్రసంగిస్తూ తాము కూడ చేయూతగా సంపూర్ణ సహాకారం అందిస్తామన్నారు.మంథని డిగ్రీ కళాశాల సిబ్బందితో జరిగిన సమావేశంకు ప్రిన్సిపాల్ తహర్ అధ్యక్షత వహించారు.ఈ క్రమంలో మహోత్సవాల వ్యవహార్త కొండేల మారుతి మాట్లాడుతూ1903-04 లో ప్రారంభమైన ప్రభుత్వ విద్య ఈనాటి కి 2023-24 వంద ఇరువది ఒకటవ వసంతాలుగా ఆవిష్కృతమైందన్నారు.ఈ కార్యక్రమంలో అనుసంధానంగా స్థానిక విద్యా సంస్థలను పాల్గొనేలా కార్యాచరణ సంసిద్ధమైందన్నారు.రానున్న దసరా /దీపావళి మధ్యలో జరిగే శ్రేష్ఠోత్సవాలుగా నిలచే విద్యా మహోత్సవం అపూర్వ సంచిక ఆవిష్కరణకు అందరూ సహకరించాలని కోరారు.డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తో బాటుగా సిబ్బంది ఉత్సవాల సమన్వయ కర్త తాటి బుచ్చన్న గౌడ్ లు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.