తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తహశీల్దారు కు వినతిపత్రం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,జూన్ 26(కలం శ్రీ న్యూస్):రాష్ట్రంలో అత్యంత పెద్ద సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉన్న ప్రశ్నల సంఘం 1983లో స్థాపించబడినదని,రాష్ట్రమంతటా విస్తరించబడిన 33 జిల్లాల జిల్లా శాఖలు 262 మండల శాఖలు కలిగి ఉన్న ఏకైక సంఘం హైదరాబాద్ బడి చొడి లో సొంత రాష్ట్ర సంఘ భవనంతో పాటు జిల్లా మండల శాఖలో 100 సొంత భవనాలు కలిగి ఉన్నాయన్నారు. అనునిత్యం సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి కృషి చేస్తూ, ఎన్నో ప్రజాహిత సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న ఏకంగా పెన్షనర్ల సంఘం అన్నారు.పెన్షనర్లకు సంబంధించిన కొన్ని సమస్యలు సవినయంగా తమకు సమర్పించుకున్నామని, దయతోటి విషయాలను సానుభూతితో పరిష్కరిస్తారని తమ పై పూర్తి విశ్వాసంతో ఆశిస్తున్నామని తహశీల్దారు కు వినతి పత్రం అందించారు.పెన్షన్ల నుండి కమ్యుటేషన్ ద్వారా పొందిన మొత్తము 15 సంవత్సరాల (180 వాయిదాలతో) వరకు మినహాయించబడుతున్నది. రెండవ పిఆర్సి నియమించి 1-7-23 నుండి అమలు పరచుట , అయ్యార్ చెల్లించుట గూర్చి.పెండింగ్, రెండు డిఆర్ లు చెల్లించుట గూర్చి నెలల తరబడి ఇ-కుబేర్ లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించుట. ప్రతినెలా మొదటి తేదీన పెన్షన్లు చెల్లించుట. తెలంగాణ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో 85% పెన్షన్లు సభ్యులుగా ఉన్నందువలన సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రెటరీ తనుగుల విజయకుమార్,ట్రెజరర్ కొమ్రోజు శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, శశికళ,కాజా మొహీనుద్దీన్, అవదానుల మోహన్ శర్మ, రామ్ కిషన్, పాండురంగారెడ్డి, ప్రకాష్ ,శంకర్ లింగం,మారుతీ రావు, తిరుమల్, రామయ్య, పోచం, సత్యనారాయణ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.