అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి
టీడబ్ల్యూజెఎఫ్ పెద్దపెల్లి జిల్లా కమిటీ
పెద్దపల్లి,జూన్26(కలం శ్రీ న్యూస్):జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాద్ రావు కి హైదరాబాద్ రోలింగ్ హిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ త్వరలోనే జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అలాగే జిల్లాలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటుచేసి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్, రాష్ట్ర కార్యదర్శి పైడాకుల బిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఫణి సుదర్శన్,జిల్లా ఉపాధ్యక్షుడు బోయిని వినోద్, మారం తిరుపతిరెడ్డి, సుల్తానాబాద్ మండలం అధ్యక్ష కార్యదర్శులు పల్ల మహేష్, నూక రామదాసు, పిట్టల పరమేష్, దాసోహం గోపికృష్ణ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.