లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
సుల్తానాబాద్,జూన్26(కలం శ్రీ న్యూస్ ): సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్డులో జరిగిన సమావేశంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెండవ ఉప గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాం, అధ్యక్షులుగా నోముల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా ఆడెపు సమ్మయ్య, కోశాధికారిగా రాయల్ల నవీన్, ఎన్నికైన ఇతర కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.
అనంతరం అధ్యక్షులుగా ఎన్నికయిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న కాలంలో సభ్యులందరి సహకారంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ క్లబ్ ను జిల్లా స్థాయిలో ఉన్నతంగా నిలపడానికి కృషి చేస్తానని తెలుపడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటరమణ రెడ్డి, అడిషనల్ కార్యదర్శులు వలస నీలయ్య, మధుసూదన్ రెడ్డి, మోర బద్రేశం, రీజియన్ చైర్మన్ గట్టు రాజయ్య, జోన్ చైర్మన్ క్రిష్ణ కిషోర్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్లు మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ సీనియర్ సభ్యులు గజభీమ్కార్ జగన్, కొమురవెల్లి చక్రధర్, దీకొండ భూమేష్ కుమార్, కోడూరి సతీష్ కుమార్, పిట్టల వెంకటేష్, కట్ల సంపత్, పోచంపల్లి పోచమల్లయ్య, కౌశిక్ మరియు నూతన సభ్యులు తమ్మనవేణి సతీష్, పూసాల సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.