క్షతగాత్రులను పరామర్శించిన అన్నయ్య గౌడ్
సుల్తానాబాద్,జూన్26(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లో ప్రైవేటు బస్సు బోల్తా పడి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడిన ఘటన చోటుచేసుకుంది…
పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం బంధువులతో కలిసి హైదరాబాద్ లో పెళ్ళికి వెళ్లి సోమవారం ఉదయం రామగుండం తిరిగి వచ్చే క్రమంలో కాట్నపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
బస్సు ప్రమాద విషయం తెలిసిన వెంటనే హుటా హూటిన సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యులతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యాన్ని అందిచాలని కోరి, గాయపడిన వారిని పరామర్శించి అధైర్య పడవద్దని మనోదైర్యాన్ని నింపడం జరిగింది.