ముదిరాజ్ మహాసభ మండల కన్వీనర్ గా ఊదరి మల్లేష్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 25(కలం శ్రీ న్యూస్):ముదిరాజ్ మహాసభ మంథని మండల కన్వీనర్ గా ఊదరి మల్లేష్ ఎన్నికయ్యారు. ఆదివారం పాత్రికేయులకు తెలిపిన ప్రకటనలో మంథని మండల ముదిరాజ్ మహాసభ కన్వీనర్ గా ఊదరి మల్లేష్ ను నియమిస్తున్నట్లు మంథని నియోజవర్గ ఇన్చార్జి అట్టేం రమేష్ ముదిరాజ్ తెలిపారు.తన నియామకానికి సహకరించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ముదిరాజ్ కు, నియోజకవర్గ ఇన్చార్జి అట్టెం రమేష్ ముదిరాజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.