మహోత్సవాల నేపథ్యంలో అపూర్వ ఫోటోల చిత్రీకరణలో పాల్గొనండి :కొండేల మారుతి.
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 24(కలం శ్రీ న్యూస్):ప్రభుత్వ విద్య మంత్రపురి గడ్డ పతాకగా 121 వసంతాల నేపథ్యంలో ఆవిష్కరణ గానున్న “అపూర్వ” సంచికలో ప్రచురణార్థమై ఫోటోల చిత్రీకరణ లో పూర్వ విద్యార్థులు పాల్గొనాలని కార్యక్రమ వ్యవహార్త కొండేల మారుతి కోరారు.శనివారం అపూర్వ ఫోటోల చిత్రీకరణ అంశం కార్యక్రమంనకు అధ్యక్షత వహించారు.ఇక్కడ చదువుకొని వివిధ రంగాలలో నిష్ణాతులైన వారితో ఈ వారం రోజుల పాటు ఫోటోలు తీసుకుంటామన్నారు. ఇదే క్రమంలో వివిధ బ్యాచుల వారితోను అలాగే గోల్డ్ మేడలిస్స్ట్, డాక్టరేట్స్ ,ఇంజనీర్, డాక్టర్స్,ఉన్నత,విద్యాధీకులతోను, సైంటిస్ట్స్,సాహిత్యం సాంస్కృతికం,క్రీడా ఇత్యాది రంగాల వారిని ఆహ్వానిస్తున్నామన్నారు.
ఆదివారం ఉదయం 10.00 గంటల కు వంద 121వ వసంతాల చరిత కలిగిన మంథని హైస్కూల్ వద్దకు చేరుకోని ఫోటో చిత్రీకరణ విజయవంతం చేయాలని మారుతి కోరారు.కళాశాల పూర్వ అధ్యక్షుడు తాటి బుచ్చన్న గౌడ్ ,విశ్రాంత గెజిటెడ్ హెడ్మాష్టర్ మాడీశెట్టి శ్యాంసుందర్ లు పాల్గొని ప్రసంగించారు.