పాడి కౌశిక్ రెడ్డిని దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ ఊరేగించి దహన సంస్కారం చేసిన ముదిరాజ్ కులస్థులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,జూన్ 24(కలం శ్రీ న్యూస్):తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గత రెండు రోజుల క్రితం ముదిరాజ్ కులానికి సంబంధించిన ఒక విలేకరిని నిర్బంధించి కొట్టడమే కాకుండా యావత్ ముదిరాజ్ కులాన్ని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు తెలుపుతున్న నిరసనలో భాగంగా శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో ముదిరాజ్ నాయకులు అందరు కలిసి పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపి రోడ్డుపై రాష్ట్రారోకో చేసి కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మను దహనం చేసారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోతరవేని క్రాంతి ముదిరాజ్ మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజ్ లకు క్షమాపణ చెప్పాలని ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలుపుతూ ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ కులస్తులు అందరూ ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు పిల్లి శేఖర్, అనవేన సదయ్య,ఊదరి శంకర్,తీగల సమ్మయ్య,వేల్పుల సరోజన,గుండా రాజు,నారెడ్ల కిరణ్,ఆకుల పోషం,సబ్బని సంతోష్,బయ్యా రాజేష్, వీరబోయిన రాజేందర్, బర్ల సది,రెడ్డి శేఖర్,బర్ల శ్రీను,గోగుల అజయ్ ముదిరాజు లు, ముదిరాజ్ కులస్థులు, నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.