జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 24(కలం శ్రీ న్యూస్):మంథనిలో ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెమినీ గౌడ్,మంథని నియోజకవర్గ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ అధ్వర్యంలో ఎరుకల ప్రవీణ్ అధ్యక్షతన శనివారం జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ,పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి తిప్పరపు సంపత్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లడుతూ మేదోశక్తిని పెంపొందించేందుకే ఆన్లైన్ క్విజ్ యువతలోని మేదోశక్తిని పెంపొందించేందుకే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించనున్నట్టు యూత్ కాంగ్రెస్ ఇoన్చార్జి తిప్పరాపు సంపత్ తెలిపారు.
ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్త ఆన్లైన్ క్విజ్ పాల్గొనాలి అని అన్నారు.పెద్దపల్లి జిల్లా లోని అన్ని మండల యూత్ కాంగ్రెస్ కమిటీలు రద్దు చేయడం జరిగింది.యూత్ కాంగ్రెస్ మండల కమిటీలు గ్రామ కమిటీలు శనివారం రద్దు చేయడం జరిగిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ,పెద్దపల్లి జిల్లా పార్లిమెంట్ ఇంచార్జి తిప్ప్పరపు సంపత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పుదరి చంద్ర శేఖర్, నయీముద్దీన్, కొప్పుల గణపతి,సునీల్ గౌడ్,ఆర్ల నాగరాజు,కిరణ్ గౌడ్,,దాసరి శివ,సాయి,పెండ్యాల రాజు,అక్కపాకా శ్రవణ్,గొల్లపల్లి శ్రీను,బిల్లా కృష్ణ,గణేష్ ఉరుగొండ తేజ పటేల్,సందీప్,శ్రీధర్. వీణ మోహన్ సాయి,రాకేష్,రంజిత్, గుండెటీ రాజశేఖర్, ఆర్ల జ్ఞ్యాని,ఎరుకల సురేష్,మారుతి గౌడ్,గువ్వల ప్రశాంత్,సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.