పి.ఎస్.ఆర్ సతీమణిని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
ఎండపల్లి రిపోర్టర్/ పోడేటి శ్రీకాంత్
ఎండపల్లి,జూన్24(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామ ముద్దు బిడ్డ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు సతీమణి మంజుల హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా శనివారం తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.మంజుల వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయని ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ఉన్నారు.