చలో పెద్దపల్లి పూసల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 23(కలం శ్రీ న్యూస్):ఈ నెల 26వ తేదీ సోమవారం రోజున పెద్దపెల్లిలోని అమర్నగర్ సిరి ఫంక్షన్ హాల్ లో జరగబోయే పూసల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పూసల సంఘం రాష్ట్ర నాయకులు గుంటుపల్లి సమ్మయ్య మరియు మంథని డివిజన్ అధ్యక్షులు కావేటి సమ్మయ్య లు పిలుపునిచ్చారు.పూసల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ , పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి మరియు రామగుండం శాసనసభ్యులు కోరు కంటి చందర్ బీసీ కార్పొరేషన్ ఈడీ హాజరవుతున్నారని పెద్దపెల్లి జిల్లా, మంథని రామగుండం నియోజక వర్గాల లోని పూసల కులస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన పూసల కులస్తుల ఐక్యత చాటాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుంటుపల్లి సమ్మయ్య , మంథని డివిజన్ అధ్యక్షులు కావేటి సమ్మయ్య, కావేటి శ్రీనివాస్,కావేటి రవి,చేను రవి,గుంటుపల్లి సతీష్, గుంటుపల్లి గురువేశ్,పూసల మహిళలు కావేటి పద్మ,కావేటి రమ్య, కావేటి ఎల్లమ్మ,కావేటి రాజేశ్వరి, కావేటి లక్ష్మి, చిన్న పెళ్లి జమున,చిన్న పెళ్లి కవిత, చేను రాదా,గుంటుపల్లి లత,చేను లక్ష్మీ,ముద్ర కోల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.