Thursday, September 19, 2024
Homeతెలంగాణఇసుక లారీ ఢీ కొట్టి చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలి

ఇసుక లారీ ఢీ కొట్టి చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలి

ఇసుక లారీ ఢీ కొట్టి చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలి

సిపిఎం డిమాండ్

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 23(కలం శ్రీ న్యూస్):మంథని మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన సింగనవెణ లింగేష్ అనే రైతుకు చెందిన ఆరు (6) గేదెలు మంథని మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాల ముందు ఇసుక లారీ ఢీకొనడంతో నాలుగు (4) గేదలు మృత్యువాత పడడం జరిగింది. 2 ప్రాణాలతో పోరాడుతున్నాయి అని అన్నారు. పాడి రైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులతో మరియు సిపిఎం,కాంగ్రెస్ కిసాన్ సెల్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంథనిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని అన్నారు.ఇసుక లారీలు మద్యం మత్తులో,అధిక లోడు మరియు అత్యంత వేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మంథని మండలంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో సంబంధిత అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. వెంటనే మూగజీవుల చావుకు కారణమైన లారీని మరియు ఆ డ్రైవర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మరియు పాడి రైతు కోల్పోయిన ఆరు(6) గేదెలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్, సిపిఎం నాయకులు ఆర్ల సందీప్,కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కల సురేందర్ రెడ్డి, నాయకులు కిరణ్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!