మేరీ మీడియా ట్రిక్స్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 22(కలం శ్రీ న్యూస్):మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని మేరీ మీడియా ట్రిక్స్ స్కూల్ యజమాన్యం బుక్ స్టాల్ యజమానితో కుమ్మక్కై స్కూల్ ఎదురుగా పుస్తకాల దుకాణం తెరిచి బహిరంగంగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.విద్యార్థులకు బలవంతంగా పుస్తకాలు నోట్ బుక్స్ అంటగడుతూ విద్యార్థుల నుండి అధిక రేట్లు ముక్కు పిండి వసూలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను నిలువు దోపిడికి గురిచేస్తున్నారు.ఇట్టి విషయంపై ప్రజాసంఘాల నాయకులు మంథని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయడానికి మండల విద్యాధికారి కార్యాయాలనికి వెళ్లగా కార్యాలయ సిబ్బంది ఎవరు అందుబాటు లేరు.గేటు వేసి ఉంది.ఆఫీస్ సమయంలో కార్యాలయ అధికారులు అందుబాటులో లేకపోవడంతో గేటు వేసి ఉండడంతో ప్రజా సంఘాల నాయకులు గేటుకు వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మేరీ మీడియా ట్రిక్స్ యజమాన్యం అక్రమంగా బహిరంగంగా పాఠశాల ఎదురుగా పుస్తకాల దుకాణం తెరిచి విద్యార్థులకు అధిక రేట్లకు విక్రయిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మండల విద్యాధికారి పాఠశాలను తనిఖీ చేసి పుస్తకాల దుకాణాన్ని సిజ్ చేసి స్కూల్ యజమాన్యం పై చర్యలు తీసుకొని పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం అందించాలని డిమాండ్ చేశారు.ఆయన వెంట ఎంఎస్ఎఫ్ అధికార ప్రతినిధి కడారి సతీష్ లు ఉన్నారు.