అమరవీరులకు నివాళి అర్పించిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 22(కలం శ్రీ న్యూస్):ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసి పడుతుండగా తెలంగాణ ఉద్యమ గొంతునొక్కిన చరిత్ర కాంగ్రెస్ పాలకులదేనని బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా గురువారం మహదేవ్‌పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరించిన ఆయన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే ఆనాడు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఉద్యమాన్ని అణిచివేసేలా ప్రయత్నం చేశారని,ఈ ప్రాంతంలో ఉద్యమం లేదని చాటి చెప్పే ప్రయత్నంలో బాగంగా కొయ్యూర్‌కు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తో సభను నిర్వహించి ఢిల్లీలోని కాంగ్రెస్‌కు గొప్పగా సభ నిర్వహించామని ఉద్యమం లేదని చాటి చెప్పాడని ఆయన గుర్తు చేశారు. కానీ అలాంటి అణిచివేసే ప్రయత్నాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తమ ఉద్యమ స్పూర్తిని చాటి చెప్పేలా ఈనాడు తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల స్పూర్తితో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పగా పరిపాలన అందిస్తోందన్నారు. నాడు నేడు పరిస్థితులపై బేరీజు వేసుకునే విధంగా తెలంగాణ ఆవిర్బాద దశాబ్దిఉత్సవాలు జరుపుకుంటున్నామని,ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం,ఈనాటి తెలంగాణ ప్రభుత్వంలో జగిగిన అభివృధ్ది,మార్పులపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అభివృధ్దిని బేరీజు వేసుకోకపోతే మళ్లీ మోసం చేసేవాళ్లు మన ముందుకు వస్తారని ఆయన సూచించారు. గత పాలకుల పనితీరుకు మహాదేవ్‌పూర్ బస్టాండ్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని, 1991లో బస్టాండ్ ప్రారంభమైతే 2014వరకు కూడా బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. పేరుకే బస్టాండ్ ఉన్నా బయట నుంచే బస్సులు వచ్చి పోయేవనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 2014తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ నాయకత్వంలో బస్టాండ్‌ను అభివృధ్ది చేసి సకల సౌకర్యాలు కల్పించామని,ఈ ప్రాంత ఆడబిడ్డల ప్రయాణాలకు ఇబ్బందులు రావద్దనే ఆలోచన చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంపై ప్రేమ ఉన్న నాయకులే మన గురించి ఆలోచన చేస్తారే తప్ప ఏదో అధికారం,పదవుల కోసం ఆరాటపడేవారు ఎందుకు అభివృధ్ది చేస్తారని ఆయన ప్రశ్నించారు. బారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని, ఈ నియోజకవర్గంలో ప్రపంచ మేధావిగా పేరు గాంచిన అంబేద్కర్‌ను కాంగ్రెస్ నాయకులు కనబడనీయలేదని, ఒక్క విగ్రహం పెట్టి ఆయన చరిత్ర చాటి చెప్పే ప్రయత్నం చేయలేదన్నారు.తమ విగ్రహాలే పెట్టి తమ చరిత్రను చెప్పే ప్రయత్నంచేస్తూ చీకట్లోనే ఉండాలని కోరుకున్నారే కానీ ఈ ప్రాంతానికి వెలుగులు ప్రసాదించాలని ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. అలాంటి చీకటి పాలనను అంతం చేయాలంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,మాయమాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని, అభివృధ్ది, సంక్షేమం బీఆర్‌ఎస్‌పార్టీ, సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆయన ఈసందర్బంగా స్పష్టం చేశారు.