ప్రజల అకాంక్షను నెరవేర్చడం బీఆర్‌ఎస్ తోనే సాధ్యం
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 22(కలం శ్రీ న్యూస్):అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగాలను బీఆర్‌ఎస్ పార్టీ,సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగిస్తున్నామని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా గురువారం మంథని బొక్కలవాగు రెండో వంతెనపై అమరవీరుల స్మారక స్థూప నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ,జిల్లా అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎంతో మంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేశారని ఆయన గుర్తు చేశారు.అమర వీరుల ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు ఉద్యమం కొనసాగించిన ఉద్యమకారులను గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ అండగా నిలిచారని,వారికి అన్ని విధాలుగా సాయం అందించారని ఆయన చెప్పారు.దశాబ్ది ఉత్సవాల సందర్బంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని,వారి స్మారకంగా హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్ధూపాన్ని సైతం సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.అలాగే అన్ని నియోజకవర్గాల్లో అమర వీరులను స్మరించుకునే స్మారక స్థూపాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం తోపాటు వారి ఆశయాలను కొసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురు ఉద్యమకారులను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు.