ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే లను మర్యాద పూర్వకంగా కలసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సుల్తానాబాద్ మండల కమిటీ సభ్యులు
పెద్దపల్లి,జూన్ 22(కలం శ్రీ న్యూస్):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) సుల్తానాబాద్ మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లను పెద్దపల్లి ఐబి గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంక మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బోయిన వినోద్, జిల్లా సహాయ కార్యదర్శి సాబీర్ పాషా, సుల్తానాబాద్ మండలం అధ్యక్షుడు పల్ల మహేష్, మండల ప్రధాన కార్యదర్శి నూక రామదాసు, మండల కోశాధికారి పిట్టల పరమేష్,మండల ఉపాధ్యక్షుడు గోపికృష్ణ ,మండల జాయింట్ సెక్రెటరీ ఓంకార్ గౌడ్, సబ్బు సతీష్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.