ఎక్లాస్ పూర్ లో మహీంద్రా న్యూ మాడల్ ట్రాక్టర్ లాంచ్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 21(కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామం లో మంథని మహీంద్రా షోరూమ్ సేల్స్ మెన్ బూడిది రంజిత్ ఆధ్వర్యంలో బుధవారం మహీంద్రా న్యూ మాడల్ ట్రాక్టర్ ను ఎక్లాస్ పూర్ సర్పంచ్ చెన్నవేన సదానందం లాంచ్ చేశాడు.షోరూమ్ సిబ్బంది, మెకానిక్ రామకృష్ణ రైతులకు న్యూ మాడల్ మహీంద్రా ట్రాక్టర్ లలో వచ్చిన కొత్త ఫ్యూచర్స్ గురించి వివరించారు.రైతులు ఈ ట్రాక్టర్స్ వాడడం వల్ల డీజిల్ ఆదా చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెండ్లి ప్రభాకర్ రెడ్డి, మంథిని లక్ష్మన్, ఉడుత లింగయ్య,మేకల కుమార్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.