నంబర్ ప్లేట్ లేకుంటే వాహనాలు సీజ్
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకే
సుల్తానాబాద్ సిఐ జగదీష్
సుల్తానాబాద్ (కలం శ్రీ న్యూస్): నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని సుల్తానాబాద్ జగదీష్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి సుల్తానాబాద్ లో నలుమూలల పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు లేని 45 వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ రవాణా శాఖ నిబంధన ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించుకోవాలని లేకపోతే జారిమానాలతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎందరో మృత్యువాత పడటంతో పాటు క్షతగాత్రులు అవుతున్నారన్నారు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ఇకపై తరచూ వాహనాల తనిఖీ చేపడతామని వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని లేకపోతే జరిమానాలు తప్పవన్నారు. తనిఖీల్లో ఎస్సైలు విజయేందర్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, రామకృష్ణ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.