టిడబ్ల్యూజేఎఫ్ మండల కమిటీ ఎన్నిక
టిడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్షులుగా పల్లా మహేష్, ప్రధాన కార్యదర్శిగా నూక రాందాసు ఎన్నిక
సుల్తానాబాద్, జూన్ 21(కలం శ్రీ న్యూస్):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్ ) సుల్తానాబాద్ మండలం కమిటీని స్థానిక ఆర్య వైశ్య భవన్ లో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు పోగుల విజయ్ కుమార్,సుంక మహేష్ ఆధ్వర్యంలో బుదవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పెద్దపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా సుంక శ్రీధర్,టిడబ్ల్యూజేఎఫ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులుగా పల్లా మహేష్,ప్రధాన కార్యదర్శిగా నూక రాందాసు, కోశాధికారిగా పిట్టల పరమేష్, ఉపాధ్యక్షులుగా దాసోహం గోపి కృష్ణ,జాయింట్ సెక్రటరీగా కాపరబోయిన బాలరాజు,బొల్లి సత్యం,చొప్పరి సుమన్,బుర్ర ఓంకార్ గౌడ్,ఈసీ మెంబర్స్ గా దొడ్ల దేవేందర్, ఆడేపు సదానందం,సంతోష్,బత్తుల చంద్ర శేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిలు పల్లా మహేష్,నూక రాందాసు లు మాట్లాడుతూ టిడబ్ల్యుజేఎఫ్ బలోపేతం కోసం కృషి చేస్తామని,జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిని వినోద్,రాపోలు రాజు,సముద్రాల రమేష్,దేవేందర్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.