మర్యాదపూర్వకంగా ఎస్సైని కలిసిన టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు
సుల్తానాబాద్,జూన్21(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సుల్తానాబాద్ మండల కమిటీ సభ్యులు బుధవారం రోజు మర్యాదపూర్వకంగా సుల్తానాబాద్ నూతనంగా ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన విజయేందర్ ని టిడబ్ల్యూజేఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పొగుల విజయ్, ప్రధాన కార్యదర్శి సుంక మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బోయిని వినోద్ , పెద్దపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుంక శ్రీధర్, సుల్తానాబాద్ మండలం అధ్యక్షులు పల్లా మహేష్, ప్రధాన కార్యదర్శి నూక రామదాసులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి పిట్టల పరమేష్ ,మండల ఉపాధ్యక్షులు గోపికృష్ణ, జాయింట్ సెక్రెటరీ సుమన్ ,బాలరాజు ,ఓంకార్ గౌడ్, సత్యం, మండల ఈసీ మెంబర్స్ దేవేందర్, సంతోష్ ,సదానందం, చంద్రశేఖర్ సముద్రాల రమేష్, సంతోష్ లతోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.