Saturday, July 27, 2024
Homeతెలంగాణఅనాధ పిల్లల సంక్షేమం కోసం జూన్ 23 న జిల్లా కేంద్రాల్లో 'అనాదల అరిగోస' దీక్ష...

అనాధ పిల్లల సంక్షేమం కోసం జూన్ 23 న జిల్లా కేంద్రాల్లో ‘అనాదల అరిగోస’ దీక్ష లు.

అనాధ పిల్లల సంక్షేమం కోసం జూన్ 23 న జిల్లా కేంద్రాల్లో ‘అనాదల అరిగోస’ దీక్ష లు.

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 20(కలం శ్రీ న్యూస్):సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అనాదహక్కుల పోరాట వేదిక,  ఎమ్మెస్పీ, ఎమ్మార్పీఎస్ ల ఆధ్వర్యంలో జూన్ 23 న జరిగే దీక్ష లకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు,అనాద ఆశ్రమాల నిర్వాహకులు అండగా నిలవాలని కోరుతున్నాం.అనాధ పిల్లల కన్నీళ్లు తుడవడానికి, ప్రభుత్వం నుండి రావాల్సిన సదుపాయాలను అందించడం కోసమే జరుగుతున్న ఈ దీక్షలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు ఈ ఉద్యమం లో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నామని తెలిపారు.

అందులో ప్రధాన డిమాండ్ లు

కేసీఆర్ ప్రభుత్వం అనాద పిల్లులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను వెంటనే అమలు చేయాలి.

అనాధ పిల్లలకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలి.

అనాధ పిల్లలకు విద్య ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి.

అనాధ పిల్లలకు వెంటనే స్మార్ట్ కార్డులు అందజేయాలి.

పై డిమాండ్ ల పరిష్కారం కోసం జరిగే దీక్ష లను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంథని సామ్యెల్ మాదిగ.మహాజన సోషలిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జి.నూనేటి రాజు అనాధ హక్కుల పోరాట వేదిక(AHPV)రాష్ట్ర ఉపాధ్యక్షుడు.బోయిని అనిల్ అనాధ హక్కుల పోరాట వేదిక.మంథని మండల కన్వీనర్.(AHPV)మంథని ప్రమోద్AHPVమంథని చందు మాదిగ,మంథని లింగయ్య,సింగారపు సుధాకర్,సింగారపు అశోక్,పోచంపల్లి రాజయ్య,కాసిపేట బాపు,మంథని అన్విత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!