మంథని లోని దేవాలయాలను సందర్శించిన శ్రీ శృంగేరి శివగంగా పీఠాధిశ్వరులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 20(కలం శ్రీ న్యూస్):అనంత విభూషకులు శ్రీ దక్షిణాన్మయ శృంగేరి శివగంగ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ పురుషోత్తమ భారతి స్వామి వారు మంగళవారం మంథని పట్టణంలోని ప్రముఖ దేవాలయాలు సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసి, హృదయపూర్వక స్వాగతం పలికారు. ఉదయం 5 గంటలకు గోదావరి నదిలో స్నానమాచరించిన అనంతరం శ్రీ గౌతమేశ్వర స్వామికి అభిషేకాన్ని నిర్వహించారు.అనంతరం శ్రీ సురాబాండీశ్వర స్వామి వారిని దర్శించుకుని శ్రీ మహాలక్ష్మి దేవాలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సాయంత్రం ఏడు గంటలకు కాలేశ్వరం మీదగా స్వామి వారు మంథని చేరుకున్నారు.ఈ సందర్భంగా భక్తులు మంగళ హారతులు ఇచ్చి స్వామివారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంథని పురవీధుల గుండా స్వామివారి విజయ యాత్ర నిర్వహించారు. శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర దేవాలయం చేరుకున్న తర్వాత స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మంథని పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం లో భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు.