దశాబ్ది ఉత్సవాలలో శతాబ్ది దోపిడి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 16(కలం శ్రీ న్యూస్):మంథని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంథనిలో నిర్వహించినటువంటి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతిని వ్యతిరేకిస్తూ మంథని పట్టణంలో జరిగిన దోపిడి గురించి ప్రశ్నించడం జరిగింది. వెటర్నరీ సర్టిఫికేషన్ లేని స్లాటర్ హౌసులు, రెండవ వార్డ్ లో నీటి సమస్య,మూడో వార్డులో అక్రమంగా గోవదశాల నిర్వహణ, కోనో కార్పస్ చెట్ల ద్వారా ప్రజల ఆరోగ్యాలతోచెలగాటమాడుకోవడం ,డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం,డంపింగ్ యార్డ్ లేకపోవడం,డంపింగ్ యార్డు మాతా శిశు హాస్పటల్ దగ్గరలో ఉన్నందున పొగద్వారా పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది.ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మంథని మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుండి ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం మేడిపండు చందంగా దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ నాయకులపై ప్రజలలో చర్చ జరిగి తీరాలి. ఆ చర్చ ద్వారా రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలు బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి సునీల్ అన్న, మంథని పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టడానికి కావలసిన కేంద్రంగా వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉన్నాయని, ఈ అభివృద్ధి కేవలం సునీల్ అన్న తోటే సాధ్యమని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎడ్ల సదశివ్,సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కొరబోయిన మల్లిక్,బూడిద తిరుపతి,పట్టణ ఉప అధ్యక్షులు దాసరి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.