Thursday, October 10, 2024
Homeతెలంగాణఫర్టిలైజర్లు సిండికెట్ గా మారి రైతులను ముంచుతున్నారు             ...

ఫర్టిలైజర్లు సిండికెట్ గా మారి రైతులను ముంచుతున్నారు               

ఫర్టిలైజర్లు సిండికెట్ గా మారి రైతులను ముంచుతున్నారు               

 మాదాడి శ్రీనివాస్ రెడ్డి 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 15(కలం శ్రీ న్యూస్):మంథని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటన లో మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాదాడి శ్రీనివాస్ రెడ్డి రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న దగా రాష్ట్ర ప్రభుత్వం పత్తి గింజల తయారీ యజమాన్యంతో కుమ్మక్కై మంథని నియోజకవర్గంలో ఫెర్టిలైజర్ వ్యవస్థ సిండికేట్గా మారి రైతులను నట్టేట ముంచుతున్నారని గతంలో ఒక ప్యాకెట్ రేటు 810 రూపాయలు ఉండగా రైతులకు 720 రూపాయలకు పత్తి ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మార్కెట్లో 853 రూపాయల రేటు ఉండగా 950 రూపాయలకు సిండికేటుగా మారి రైతులకు అమ్ముతున్నారు. మరి కొన్ని కంపెనీల ప్యాకెట్లను బ్లాక్ చేసి 1300 నుండి 2000. వరకు అమ్ముతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అగ్రికల్చర్ కు సంబంధించిన అధికారులు కానివ్వండి పట్టించుకోకుండా చూస్తూన్నారు. రైతాంగాన్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో మెండే రాజయ్య తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మంథని మండల పార్టీ అధ్యక్షులు మేదరవేన ఓదెలు,యువత అధ్యక్షులు బడుగు మహేష్, తాళ్లపల్లి శ్రీనివాస్,మంథని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!