ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపకులు, మహాజన ఉద్యమనేత మందకృష్ణ మాదిగ ని సన్మానించిన . బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 14(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఎంఆర్ పిఎస్ డివిజన్ కార్యకర్తల సమావేశంనికి విచ్చేసిన ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మార్కెట్ లో గల రామ్ రెడ్డి కాంప్లెక్స్ లో మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఇరువురు నేతలు SC రిజర్వేషన్ వర్గీకరణ పై ,పార్లమెంట్ లో SC రిజర్వేషన్ల పై చట్టబద్ధత అనే అంశాలపై బిజెపి పార్టీ వైఖరి మరియు రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల తీరు తెన్నులపై అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్,బూడిద తిరుపతి, పబ్బ తిరుపతి,యువ నాయకులు చిట్టావేని హరీష్, బండ శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.