ఎస్సీ వర్గీకరణపై బీజేపీ,బిఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడాలి
– మందకృష్ణ మాదిగ
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 14(కలం శ్రీ న్యూస్): పార్లమెంటులోని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.మంథని అంబేద్కర్ భవన్ కార్యాలయ ఆవరణలో మంథని నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎస్సి వర్గీకరణపై బిఆర్ఎస్,బిజెపి ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వీడాలని,మాట ఇచ్చి వర్గీకరణ చేయకుండా ఉండటం మాదిగలను మోసం చేయటమేనని ఆయన అన్నారు.11% ఉన్న మాదిగ జనాభాను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు మాదిగలకు మోసం జరుగుతూనే ఉందన్నారు. రాబోయే ఎస్సి వర్గీకరణ సాధనకై మాదిగ,మాదిగ ఉప కులాలు ముందుండి పోరాడాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట తప్పయన్నారు.సామాజిక,ఆర్థిక, రాజకీయ,న్యాయం పునాదిగా ఆణగారిన వర్గల ప్రజల అభివృద్ధి కోసమే మహాజన సోషలిస్టు పార్టీ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు.అణగారిన వర్గాల సహకారంతో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆ వర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.అందుకోసం గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణాలను బలోపేతం చేయాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణ పై నిర్లక్ష్యం చేస్తున్న పార్టీలకు రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంథని సామ్యేల్ మాదిగ, మంథని చందుమాదిగ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్,తగరం శంకర్ లాల్,బూడిద రాజయ్య,సీనియర్ న్యాయవాది రఘోత్తమ్ రెడ్డి,నాయకులు ముత్యాల లింగయ్య,బూడిద శంకర్,మంథని లక్ష్మణ్,కన్నూరి ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.