Saturday, July 27, 2024
Homeతెలంగాణతెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న  కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి 

తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న  కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి 

తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న  కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూన్13(కలం శ్రీ న్యూస్): మంథనిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన”తెలంగాణ మహిళా దినోత్సవ” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రా బిఆర్ఎస్ నాయకులు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ రాష్టాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా మహిళా,శిశు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక గొప్ప పథకాలు ప్రవేశపెట్టి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు.

మహిళలను అన్నీ రంగాల్లో ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికంగా, సామాజికంగా చేయూతనందిస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ సందర్బంగా నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం సందర్బంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ ,పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్,ఎంపీపీలు,పిఏసిఎస్ చైర్మన్లు,మార్కెట్ కమిటీ చైర్మన్లు,సర్పంచులు,అంగన్ వాడీ టీచర్లు,ఆయాలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!