బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి నియామకం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,జూన్ 13(కలం శ్రీ న్యూస్):మంగళవారం నూతనంగా నియమించబడిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి ని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియమించారు.ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి,కేంద్ర కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ రావ్ కి, ప్రేమేంధర్ రెడ్డి కి,పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రామ్ నాథ్ కి,జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ కి,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కన్నం యుగేందర్ కి,బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులుకు సునీల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.తన పై నమ్మకం తో అప్పగించిన ఈ బాధ్యత ను పూర్తిస్థాయిలో నెరవేరుస్తానని చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.