Wednesday, May 29, 2024
Homeతెలంగాణమంథనిలో క్షుద్ర పూజల కలకలం

మంథనిలో క్షుద్ర పూజల కలకలం

మంథనిలో క్షుద్ర పూజల కలకలం

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 13(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్ షెట్టర్స్ సమీపంలో మంగళవారం క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపాయి.అండర్ గ్రౌండ్ షట్టర్స్ రూమ్ నెంబర్ 8 వద్ద క్షుద్ర పూజ చేసినట్లుగా ఆనవాళ్లు కనిపించడంతో కాంప్లెక్స్ లోని షట్టర్ వినిగదారులంతా అందోళనకు గురవుతున్నారు. మిట్ట మధ్యాహ్నం పూట ప్రధాన రహదారి పై ఉన్న ఈ షెట్టర్ వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం అందర్నీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.గతంలో సైతం పలుమార్లు ఇదే షెటర్ ముందు భాగంలో కాల్చిన బొగ్గులు, బూడిద,పూలు,ఇతర వస్తువులు కనిపించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు.ఈరోజు స్మశానంలో కాల్చిన బొగ్గుల బూడిద,శవ భస్మం,ఎర్రటి గులాబీ పూలు,అందులో నాణేం, ఇలాంటివి షట్టర్ మధ్య భాగంలో కనిపించడంతో క్షుద్ర ప్రయోగం జరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని షెట్టర్ల వినియోగదారులు పోలీస్ అధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!