బీసీలకు 56 శాతం సీట్లు ఇవ్వాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉప అధ్యక్షులు సబ్బు సతీష్ డిమాండ్
పెద్దపల్లి,జూన్12(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి మండల కేంద్రంలో ని ముఖ్య కార్యకర్తల సమావేశం లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రాతిపదికన యాభై ఆరు శాతం ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వాలి అని జాతీయ బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షులు సబ్బు సతీష్ డిమాండ్ చేశారు. సోమవారం మండలం పరధిలో వారు మాట్లాడుతూ గత డెబ్భై ఐదు సంవత్సరాలనుండి వివిధ రాజకీయ పార్టీలు బీసీలకు విద్య, వైద్య, ఉద్యోగ,ఉపాధి మరియు రాజకీయ రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇవ్వకపోవడం వలన బీసీలు ఈ రంగాలలో చాలా వెనుకబడిపోయారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా వచ్చిన తరువాత కూడా ఈ ఇవక్షత కొనసాగుతున్నదని,బి ఆర్ యస్ ప్రభుత్వం బీసీలను బిచ్చగాళ్లుగా చేసిందని వాపోయారు. ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తుండటం వలన అక్కరకు రాణి పథకాలను పెట్టి మళ్ళీ ఓట్లు దండు కోవాలని చూస్తున్నారని, ఇప్పుడు మాకు కావలిసింది స్కిములు కాదని, నిజముగా బీసీలపట్ల ప్రేమ ఉంటే వచ్చే ఎన్నికల్లో డెబ్భై ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.లేనిచో బీసీలు ఏకమై రాష్ట్రంలో ఏరాజకీయాపార్టీ బీసీ నాయకులకు ఎమ్మెల్యేటికెట్స్ ఇస్తుందో అపార్టీకే బీసీల మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సోప్పరి సాధయ్య, ముద్దం తిరుపతి,తాటిపాముల సందీప్,పొన్నాల లక్ష్మణ్, చాట్ల రవి, రాచకొండ అనిల్,రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు