Tuesday, October 8, 2024
Homeతెలంగాణమంథనిలో గెలుపు బీజేపీ పార్టీదే

మంథనిలో గెలుపు బీజేపీ పార్టీదే

మంథనిలో గెలుపు బీజేపీ పార్టీదే

కార్యకర్తలు మరింత పట్టుదలతో కష్టపడి పనిచేయాలి

జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్,బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 12(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మంథని పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిధిలుగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ,బిఆర్ఎస్ నియంత,కుటుంబ పాలనకు చరమ గీతం బీజేపీ పార్టీ తో పాడుదాం,పార్టీని నమ్ముకున్న వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది,కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు బీజేపీ పార్టీలో ఉంటుంది. దానికి నిదర్శనం మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రానున్న రోజుల్లో బీజేపీ మరింత పుంజుకుంటుంది,మంథని ప్రాంతంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు,బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి, కాంగ్రెస్,బిఆర్ఎస్ మంథనికి చేసిన అన్యాయన్ని దోపిడీని ప్రజలకి మనమే వివరించాలి,ప్రజల్లో చర్చ జరగాలి కేంద్రంలో మరోసారి బీజేపీ తెలంగాణలో ఈసారి బీజేపీ అనే నినాదం ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ మల్కామోహన్ రావ్,కోకన్వినర్ నాంపల్లి రమేష్, మండల ఇంచార్జ్ లు విరబోయిన రాజేందర్,తోట మధుకర్,పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్,ముత్తారం మండల ఇంచార్జ్ పోతారవేని క్రాంతికుమార్,పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్,బోగోజు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!