ఇండియా మిషన్ స్కూల్ కరస్పాండెంట్ గా అంకరి కుమార్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 12(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఇండియా మిషన్ హై స్కూల్ కరస్పాండెంట్ గా అంకరి కుమార్ సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా అధ్యక్షుడు ఐజక్, ప్రధాన కార్యదర్శి జోనా గోపి లు అంకరి కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో మొట్ట మొదటి స్కూల్ అయిన ఇండియా మిషన్ స్కూలును అందరి సహకారంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో హాస్టల్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా మిషన్ డైరెక్టర్ మనోహర్,ఎఫ్ ఈ సి డైరెక్టర్ సుదర్శన్, పెద్దపల్లి ఫీల్డ్ సెక్రటరీ వాసాల డేవిడ్, కోశాధికారి కల్వల డిక్ పాల్గొన్నారు.