ములుగు జెడ్పీ చైర్మన్‌కు ఘన నివాళి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 12(కలం శ్రీ న్యూస్):గుండెపోటుతో అకాల మృతి చెందిన ములుగు జిల్లా పరిషత్ చైర్మన్,బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్‌కు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ పుట్ట మధూకర్,భూపాల పల్లి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జక్కుశ్రీ హర్షిని రాకేష్ ఘన నివాళులు అర్పించారు.ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలోని కుసుమ జగదీష్ పార్థివ దేహన్నిసందర్శించి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.కుసుమ జగదీష్ మృతి పార్టీకి తీరని లోటని,పార్టీ కోసం ప్రజల కోసం నిత్యం ఎంతో కృషి చేసే వారని కొనియాడారు. ఆప్తమిత్రుడైన జగదీష్‌ను కోల్పోవడం చాలాబాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నట్లు చెప్పారు.