Monday, May 27, 2024
Homeతెలంగాణయువత మంచి మార్గంలో నడిచి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి 

యువత మంచి మార్గంలో నడిచి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి 

యువత మంచి మార్గంలో నడిచి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి 

టూ కే రన్‌లో పాల్గొన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూన్ 12(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృధ్దిపై చర్చించకపోతే మళ్లా మాయమాటలతో ఆగం చేస్తరని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా మంథని పోలీస్‌ ఆధ్వర్యంలో మంథని బొక్కలవాగు బ్రిడ్జి నుంచి చేపట్టిన టూ కే రన్‌ను జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ఆనాడు దేశంలో, రాష్ట్రంలో మంథనిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం, పాలకులు అభివృద్ది చేయాలనే ఆలోచన చేయలేదని,అభివృధ్ది నిరోధకులు కాంగ్రెస్‌ పాలకులు అని ఆయన విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు అనేక ఏండ్లు పరిపాలన చేసినా ఎక్కడా అభివృధ్ది జరుగలేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే అభివృధ్ది బాటలు పడ్డాయని ఆయన తెలిపారు.నాడు నేడు పరిస్థితులపై బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని, మనం అభివృధ్దిపై చర్చించుకోక పోతే మళ్లా మేమే అంతా చేశామని కాంగ్రెస్సోళ్లు మోసం చేసే ప్రయత్నం చేస్తారని,ఈ క్రమంలోనే దశాబ్ది ఉత్సవాల పేరుతో అభివృధ్ది, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం,ఇక్కడి పాలకుల పనితీరుకు మంథని జెఎన్‌టీయూ కళాశాలే నిదర్శమని,కళాశాల తెచ్చాం అనిచెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు కళాశాలలో వసతుల కల్పనపై ఎందుకు దృష్టి సారించలేదో చెప్పాలన్నారు. కేవలం కళాశాల భవనం తీసుకురావడమేనా అభివృధ్ది అంటే అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడెక్కడి నుంచే చదువుకోవాలనే తపనతో వచ్చిన విద్యార్ధులను ఆగం చేశారని ఆయన వాపోయారు. జెఎన్‌టీయూ కళాశాలలో లైబ్రరీలు,హెచ్‌ఓడీలు, ఇన్ఫాస్ట్రక్చర్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదని,కేవలం తాము ఎదో గొప్ప పని చేశామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం,పాలకులు అభివృధ్ది గురించి ఆలోచన చేసి ఉంటే ఈనాడు పేదోడు ఇంకా పూరి గుడిసెల్లో ఉండేవాడా అని ఆయన ప్రశ్నించారు.అంతేకాకుండా జేఎన్‌టీయూ కళాశాలను తీసుకువచ్చిన అప్పటి పాలకులు విద్యార్ధుల భవిష్యత్‌ గురించి ఆలోచన చేయకుండా ముందుచూపు లేమితో మైనింగ్‌ కోర్సును తీసుకువచ్చారని, మైనింగ్‌ కోర్సు చదువుకుని విద్యార్ధులు రోడ్డుమీద పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు మైనింగ్‌ కోర్సు చేసిన విద్యార్దుల గురించి గొప్పగా ఉన్నత చదువులు చదువుకున్న వారే పట్టించుకోలేదని, కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత చదువుకోకపోయినా తాను విద్యార్ధుల గురించి ఆలోచన చేశామని ప్రభుత్వంతో మాట్లాడి మైనింగ్‌ విద్యార్ధుల భవిష్యత్‌కు మార్గం చూపాలమని చెప్పారు. అంతేకాకుండా కళాశాలలో విద్యార్ధులు సైన్ప్‌ఫేర్‌ చేసుకుంటే నిధులు లేక ఇబ్బందులు పడిన దుస్థితులు ఉన్నాయని, తాము విద్యార్ధులు సైన్స్‌ఫేర్‌ నిర్వహించుకోవాలని రూ.2లక్షలు స్వంతంగా అందజేసిన చరిత్ర మాదేనని ఆయన గుర్తు చేశారు. ఇలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తాము విద్యార్ధుల భవిష్యత్‌, ఈ ప్రాంత అభివృధ్ది, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేశామన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కళాకారులు ఏ పాటలు రాసుకున్నామే ఆ పాటలను సాకారం చేసుకున్నామని అన్నారు. ఈనాడు అభివృధ్ది ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌ పాలకులు కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే మంథనిలో సంబరాలు జరుపుకోవడం విడ్డూరమన్నారు.అక్కడ అమలు చేసే సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తరా అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్‌ కర్ణాటక సంబరాలపై యువత ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టూ కే రన్‌ ద్వారా యువతకు ఎంతో ప్రయోజనం ఉంటుందని,ఈనాడు యువత మన సంప్రదాయాలు, సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు మార్గాల్లో పయనించకుండా మంచి మార్గాల్లో నడిచి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.ఆరోగ్య రక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఫ్యాషన్‌ పేరుతో ఆరోగ్యానికి కీడు చేసుకుంటున్నామని, ప్రతి విషయాన్ని అవగతం చేసుకుని మార్గ దర్శకులుగా నిలువాలని ఆయన అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలు,ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రతి యువత ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని,చదువు భవిష్యత్‌కు, సమాజహితం కోసం ఉపయోగపడే విధంగా ఉండాలే కానీ ఉద్యోగాల కోసమే ఉండకూడదని, పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించి మంచి మార్గాలను ఎంచుకోవాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్,ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,ఎంపిడిఓలు,సిఐ సతీష్,,ఎస్ఐ వెంకటేశ్వర్,పోలీస్ సిబ్బంది, విద్యార్థిని,విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!