వేములవాడ రాజన్న కోడెలకు విరాళంగా ఎండు గడ్డి అందజేసి- దైవభక్తి చాటిన బొడ్డు సదానందం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 11(కలం శ్రీ న్యూస్):వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాజన్న ఆలయ కోడెలకు ఒక లారీ లోడు, మూడు టన్నుల ఎండు గడ్డిని ఆదివారం విరాళంగా అందజేసిన మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ వాస్తవ్యులు బొడ్డు సదానందం. వారి దైవ భక్తికి ఎక్లాస్ పూర్ గ్రామస్తులు పలువురు ప్రశంశించారు.వారికి వారి కుటుంబ సభ్యులకు, వారికి సహకరించిన వారికి వాళ్ల కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు రాజరాజేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని పలువురు కోరుకున్నారు.