పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్,
మంథని,జూన్11(కలం శ్రీ న్యూస్):పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించామని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ అన్నారు.మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మ ఆలయ సమీపంలోని డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు. శనివారం సాయంత్రం గాలీవాన భీభత్సంతో డంపింగ్ యార్డులోని చెత్తచెదారం రోడ్డుపైకి రావడంతో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, జెడ్పీ చైర్మన్ పుట్ట మదూకర్ ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ పర్యవేక్షణలో పరిశుభ్రత చేపట్టారు.రోడ్డుపై వచ్చిన చెత్తచెదారం ఊడ్చి శుభ్రం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పారిశుద్ద్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, నిత్యం ఆయా వార్డుల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు.మంథని మున్సిపాలిటీని జిల్లాలోనే స్వచ్చ మున్సిపాలిటీగా నిలుపాలన్న ఆలోచనతోనే ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.