ఐదు కి”మీ నడిచిన అందని కనీస ఉపాధి హామీ దినసరి కూలి..
వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కార్యదర్శి బూడిద గణేష్..
మంథని, మే 10(కలం శ్రీ న్యూస్):ముత్తారం మండల కేంద్రం నుండి 5 కిమీ దూరంలో అడవిలో నడుస్తున్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం బృందం కాలినడకన వెళ్లి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ ఉపాధి కూలీలు ముత్తారం మండల కేంద్రం నుండి పొను 5 కిలోమీటర్లు రాను 5 కిలోమీటర్లు మొత్తం 10 కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ మండుటెండల్లో పనిచేసిన శ్రమకు తగ్గ దినసరి కూలీ పడడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొలతల వాళ్ళనే ఉపాధి కూలీలకు దినసరి కూలి పడడం లేదని అన్నారు. రోజురోజుకు కూలీల సంఖ్య తగ్గిపోతుందని దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు.కూలీలకు వేసవికాలం చార్జీలు,ట్రావెలింగ్ చార్జీలు ఇవ్వడం లేదని పని ప్రదేశంలో నీటి సౌకర్యం,మెడికల్ కిట్టు,అందుబాటు లేవని విమర్శించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మెట్లను,గ్రూప్ లను ఏర్పాటు చేయాలనీ,పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా ముత్తారం గ్రామానికి పర్మినెంట్ గా ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాలని,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో కూలీలు అంత కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు బీమక్కా,చిన్న లక్ష్మి,కిష్టయ్య,ధర్మారాజు,రామస్వామి,బీమయ్య తదితర కూలీలు పాల్గొన్నారు.