ఉపాధి హామీ చట్ట రక్షణకై ఉద్యమిస్తాం
బూడిద గణేష్ (వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి)
మంథని, జూన్ 9(కలం శ్రీ న్యూస్):మంథని మండలం గాజులపల్లి గ్రామంలో జరుగుచున్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం పరిశీలించి కూలీలతో మాట్లాడి సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ నిత్యం పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరల వలన ప్రజానీకం అల్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం రోజు కూలి కేవలం 272 రూపాయలు నిర్ణయించడం బాధాకరమని అన్నారు రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని పని దినాలను 200 రోజులకు పెంచాలని కూలీలకు ప్రమాద బీమా కల్పించాలని ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.రాబోయే రోజులలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి కూలీలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూలీలు చింతం లింగయ్య బడికిల సమ్మయ్య, ఉపేందర్ తొగరి లక్ష్మి, గంగుల రాధమ్మ తదితరులు ఉన్నారు