రాజారాంపల్లి అక్షర హై స్కూల్ లో పర్యావరణ దినోత్సవం
ఎండపల్లి, జూన్ 05 (కలం శ్రీ న్యూస్) :ఎండపల్లి మండలం రాజారాంపల్లి లో పర్యావరణ దినోత్సవం సంధర్బంగా అక్షర హై స్కూల్ యాజమాన్యం స్థానిక ప్రజలకు సోమవారం రోజున జ్యూట్ బాగులు (గోనె సంచులు) పంపిణీ చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణం కాలుష్యంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని స్కూల్ పిల్లలకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ సూచనలు ఇవ్వడం జరిగింది.రాబోయే తరానికి మార్గదర్శకంగా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆశి రెడ్డి,ప్రిన్సిపల్ అనంతరెడ్డి,డైరెక్టర్ గోనె రమేష్, ,మంగ,జ్యోతి,లత,ఇంచార్జ్ పుట్ట లత తదితరులు పాల్గొన్నారు.