కుటుంబాల్లో ఆనందం నింపుతున్న ఊరి ఉత్సవాలు
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని,జూన్ 5(కలం శ్రీ న్యూస్):ఉమ్మడి రాష్ట్రంలో కనుమరుగైన మన సంస్కృతి సంప్రదాయాలకు స్వరాష్ట్రంలో గౌరవం దక్కుతోందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.సోమవారం ముత్తారం మండలం సీతంపల్లి గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి సమేత బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆయన పాల్గొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మన సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపు ఉండేది కాదని,కర్రతో చేసిన బొడ్రాయిలను మాత్రమే ప్రతిష్టించుకునే వారని ఆయన గుర్తు చేశారు.ఈనాడు ప్రత్యేక రాష్ట్రంలో ఊరూరా పాలరాతితో బొడ్రాయి,భూలక్ష్మి సమేత విగ్రహాలను అంగరంగ వైభవంగా ప్రతిష్టించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు.గ్రామాల్లో నిర్వహించుకునే ఊరి ఉత్సవాలు ప్రతి కుటుంబంలో ఆనందం నింపుతోందని,ఎక్కడెక్కడో ఉండే ఇంటి ఆడబిడ్డలు ఈ ఉత్సవాల ద్వారా కలుసుకుంటున్నారని, గతంలో దసరా పండుగకు మాత్రమే ఆడబిడ్డలు వచ్చేవారని ఆయన తెలిపారు.గ్రామప్రజలంతా కలిసిమెలిసి ఐక్యతతో ఊరి ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. గ్రామదేవతల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా, పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ఆయన ఈ సందర్బంగా వేడుకున్నారు.