డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమాన పరిచిన విద్యుత్ అధికారుల పై చర్య తీసుకోవాలి
ప్రజా సంఘాల డిమాండ్
మంథని,జూన్ 5(కలం శ్రీ న్యూస్):తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట మంథని విద్యుత్ శాఖ అధికారులు సోమవారం మంథనిలో ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది విద్యుత్ అధికారులు చెప్పులతో అంబేద్కర్ విగ్రహ ఫౌంటెన్ లోకి వెళ్లి అంబేద్కర్ విగ్రహా నిచ్చన మెట్లు ఎక్కి ర్యాలీని ఫోటోలు తీశారు.దీన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా సత్కరించి వారి యొక్క నిరసన తెలియజేశారు .ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని చెప్పులతో ఎక్కి అంబేద్కర్ ను అవమానపరచడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ ని అవమానపరిచిన మంథని విద్యుత్ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, కెవిపిఎస్ మాజీ నాయకుడు మంథని లింగయ్య,దళిత ప్రజాసంఘాల నాయకులు బూడిద రాజు,బూడిద తిరుపతి,అడ్డూరి సంపత్, ఏల్పుల సురేష్,కొయ్యల మొండి,తదితరులు పాల్గొన్నారు.