Wednesday, May 22, 2024
Homeతెలంగాణజగిత్యాలచెగ్యాం ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

చెగ్యాం ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

చెగ్యాం ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న అప్పటి విద్యార్థులు 

 

వెల్గటూర్, జూన్ 04 (కలం శ్రీ న్యూస్):వెల్గటూర్ మండలంలోని చెగ్యాం గ్రామంలో 2002-2003 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు.పూర్వపు విద్యార్థుల సమ్మేళనం స్థానిక జడ్పీ.హెచ్.ఎస్ హైస్కూల్లో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురువులతోపాటు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు.

ఈ సందర్భంగా  ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థి వివిధ వృత్తుల్లో,ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అనంతరం గురువులను పూలమాలతో సన్మానించి మెమొంటతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, స్తానిక సర్పంచ్ లావణ్య, సనీల్, ఎంపిటిసి రంగు తిరుపతి, అప్పటి విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!