సుల్తానాబాద్ చెరువులో మహిళా మృతదేహం లభ్యం
సుల్తానాబాద్,జూన్04(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చెరువులో మహిళా మృతదేహం లభించిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.మృతురాలు రేణుక 40 సంవత్సరాలు వయస్సు ఉంటుందని, రజక (చాకలి)కులానికి చెందిన వారిగా గుర్తించారు. రెండు నెలల క్రితం ఆమె భర్త చనిపోవడంతో, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో, మనస్థాపానికి గురై చెరువులో పడి చనిపోవడం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.