Saturday, July 27, 2024
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవ కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవ కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో రైతు దినోత్సవ కార్యక్రమాలు

మంథని జూన్ 3(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం కార్యక్రమం శనివారం మంథని మండలంలోని ఆరు రైతు వేదికలలో సూరయ్యపల్లి,ఎక్లాస్పూర్,పుట్టపాక,నాగారం,నాగేపల్లి,గుంజపడుగు రైతు వేదికలలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొదటగా ప్రజాప్రతినిధులు రైతులు  అధికారులతో కలిసి ఎద్దుల బండి పై  ట్రాక్టర్ల ద్వారా సంగీత వాయిద్యాలతో ఊరేగింపుగా రైతు వేదికకు చేరుకోవడం జరిగింది.తర్వాత ఫ్లెక్సీ ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ప్రారంభించడం జరిగింది.తర్వాత రాష్ట్ర వ్యవసాయ కరపత్రాన్ని తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ విద్యుత్తు సాగునీటి మరియు వివిధ శాఖలలో చెందిన అభివృద్ధిని వివరించడం జరిగింది.ఆయిల్ పామ్ పంట సాగు పంటకాల పురోగతిని వివరించడం జరిగింది. తెలంగాణ జానపద పాటలు పాడి వినిపించారు.ప్రతి రైతు వేదికలో క్లస్టర్ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు.రైతు బీమా లబ్ధి పొందిన నామినీలు మాట్లాడారు. అతిధుల ప్రసంగాలు వినిపించడం జరిగింది.తర్వాత రైతులతో కలిసి భోజనంచేసి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో ఎక్లాస్ పూర్ రైతు వేదికలో జడ్పీటీసీ తగరం సుమలత,జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్,ఎంపీడీవో బి రమేష్,ఏఇఓ మురళి,సర్పంచ్ చెన్నవేన సదానందం,ఎంపిటీసి పెండ్లి చైతన్య ప్రభాకర్ రెడ్డి,సురాయపల్లి రైతు వేదికలో పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్,రైతు బంధు సమితి అధ్యక్షులు ఆకుల కిరణ్,మండల వ్యవసాయ అధికారి పి అనూష, ఏఇఓ మాలవిక,పుట్టపాక రైతు వేదికలో ఏడిఏపి మురళి,ఏఇఓ సుధీర్,సిపిడిఓ,నాగారం రైతు వేదికలో ఎంపీపీ కొండా శంకర్, ఏసిఎల్ బి,జెడ్పిసిఈఓ శ్రీనివాస్,ఏఇఓ స్రవంతి, గుంజపడుగు రైతు వేదికలో ఏఎంసీ చైర్మన్ అనంత రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు ఏగోలపు శంకర్ గౌడ్,ఎంపిఓ ఆరిఫ్,ఏఇఓ శివకుమార్,నాగేపల్లి రైతు వేదికలో వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్,ఏఇఓ మధుకర్ అన్ని గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షులు,పంచాయతీ సెక్రటరీలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!