జెడ్పీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
మంథని జూన్ 2(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాలు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఆనాడు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని,సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అనేక అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు.అభివృధ్ది, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రo దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు, అభిమానులకు తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.