Sunday, December 3, 2023
Homeతెలంగాణ70 సంవత్సరాల స్వరాష్ట్ర కలను నిజం చేసిన తల్లి సోనియా గాంధీ 

70 సంవత్సరాల స్వరాష్ట్ర కలను నిజం చేసిన తల్లి సోనియా గాంధీ 

70 సంవత్సరాల స్వరాష్ట్ర కలను నిజం చేసిన తల్లి సోనియా గాంధీ

సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.

మంథని జూన్ 2(కలం శ్రీ న్యూస్):మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జాతీయ జెండా ఆవిష్కరించారు.తొలుతగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ర్యాలీ గా అంబెడ్కర్ చౌరస్తా కు చేరుకొని సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణా ఏర్పడి పదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!