ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత సాధన కై జూన్ 5 న ఉమ్మడి కరీంనగర్ లో జిల్లా మహాసభ
హాజరు కానున్న సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ
మహాసభ విజయవంతానికై ఉద్యమ శ్రేణులు తరలిరావాలి
మంథని సామ్యెల్ మాదిగ
మంథని జూన్ 2(కలం శ్రీ న్యూస్):స్వతంత్ర భారత చరిత్రలో తమహక్కులు సాధించుకునే యుద్ధభూమిలో పట్టు విడవకుండా రాజీపడకుండా 29సం, రాలు గా పోరాడుతున్న చరిత్ర మాదిగ ఉపకులాల కే ఉన్నది. రాజ్యాంగ ఫలాలుగా అందుతున్న ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ లలో ఉన్న అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన అందించబడాలి ఇదే డా,బీ ఆర్ అంబేద్కర్ ఆశయం.ఈ సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి 29సం, రాలు గా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన అనేక సామాజిక ఉద్యమాలు అనేక విజయాలు సాధించి పెట్టడం కూడా జరిగింది.అందులో ప్రధానంగా మాదిగ లకు గుర్తింపు గౌరవం సాధించడం, గతంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా 25వేల ఉద్యోగాలు సాధించడం, ఎస్సీ ఉద్యోగులకు ప్రమోషన్ ల్లో రిజర్వేషన్లు సాధించడం,ఎస్సీ ఉపకులాలకు కుల దృవీకరణ పత్రాలు ఎమ్మార్వోలు ఇచ్చే విధంగా చేయడం, గుండె జబ్బుపిల్లల ఉచిత ఆపరేషన్లు, వికలాంగుల,వృద్దులు వితంతు పెన్షన్లు పెంపు లాంటి విజయాలు సాధించిన ఉద్యమాలు మచ్చుకు కొన్ని మాత్రమే ఇలాంటి సామాజిక నేపథ్యం గల ఉద్యమం 29సంవత్సరాలుగా పోరాడుతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాత్రం పాలకుల నిర్లక్ష్యం, మోసం, కారణంగా చట్ట బద్దతకు నోచుకోలేదు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగ, మాదిగ ఉపకులాల అభివృద్ధి కి పునాది, జాతి సామాజిక ఆర్థిక రాజకీయ ఎదుగుదలకు ఆయువు పట్టు కనుక ప్రస్తుత పాలకుల మెడలు వంచి సాధించుకునే విధంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని అందుకు జూన్ 5 న ఉమ్మడి జిల్లా మహాసభకు తరలిరావాలని మాదిగ మాదిగ ఉపకులాలకు, వర్గీకరణ ను కోరుకునే సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం.శుక్రవారం మంథని లో జరిగిన ప్రెస్ మీట్ (కరపత్రం ఆవిష్కరణ) కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ,నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మంథని చందు మాదిగ,ఆవునూరి లింగమూర్తి, మండల అధికారప్రతినిధి మంథని లింగయ్య,టౌన్ అధ్యక్షులు సింగారపు అశోక్, నాయకులు సింగారపు సుధాకర్,చిప్పకుర్తి చందు, ప్రసాద్, విద్యార్థి నాయకులు మంథని రామకృష్ణ,అన్విత్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.