Monday, May 27, 2024
Homeతెలంగాణరైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సుల్తానాబాద్,జూన్02(కలం శ్రీ న్యూస్):

రైతు సంక్షేమం ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ బుర్ర మౌనిక శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మండల ప్రజలకు, రైతులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ వైస్ చైర్మన్ అన్నేడి మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వలస నీలయ్య, పొన్నం చంద్రయ్య గౌడ్, ఎండి. సర్వర్, ఒజ్జ సంపత్, గరిగంటి కుమార్ బాబు, బోయిని ముత్యాలు, న్యాలకొండ సంజీవరెడ్డి, లేంకల రవీందర్ రెడ్డి, కల్లేపల్లి రజిని, ఉమ్మెంతల భాస్కర్ రెడ్డితో పాటు మార్కెట్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!